మూత్రంలో ఉండే నీరు, ఉప్పు, మినరల్ మరియు ఇతర లవణాల అసమతుల్యతల కారణంగా మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడతాయి. అసమతుల్యతలు అనేవి మీరు కలిగి ఉండే రాళ్ల రకంపై ఆధారపది ఉంటుంది. స్త్రీ మరియు పురుషులలో కాల్షియం రాళ్లు చాలా సాధారణంగా ఏర్పడతాయి.
మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడటానికి కారణాలు:
సరైనంత నీరు తాగకపోవటం
సాధారణ జీర్ణాశయంలో గ్రహించబడని ఉప్పు, మినరల్ మరియు ఇతర లవణాలు మూత్రంలో నిండి ఉంటాయి. కానీ, డీహైడ్రేషన్ కారణంగా, ఉప్పు మరియు లవణాలు అవక్షేపాలుగా ఏర్పడి, రాళ్లుగా మారతాయి. డీహైడ్రేషన్ లేదా ద్రావణాలను కోల్పోవటం వంటి కారణాల ఫలితంగా, మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కావున ప్రతిరోజు మనం 8 నుండి 10 గ్లాసుల నీటిని తాగటం వలన మూత్రం శుభ్రంగా (లవణాలు దీనిలో కరిగి ఉంటాయి) ఉండి, మూత్రపిండాల రాళ్లు ఏర్పడే అవకాశం తక్కువగా ఉంటుంది. రోజు 8 నుండి 10 గ్లాసుల నీరు తాగే వారిలో మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడవు. మీకు నీరు ఎక్కువగా తాగే అలవాటు లేకుంటే రోజు 1 నుండి 2 గ్లాసులు తీసుకుంటూ, రోజు రోజుకు నీటి గ్లాసుల సంఖ్య పెంచండి. మూత్రం శుభ్రంగా లేదా తెలుపు లేదా తేలికపాటి పసుపు రంగులో ఉండాలి, మూత్రం పసుపు పచ్చరంగులో ఉంటే నీటిని ఎక్కువగా తాగండి.
ఇన్ఫెక్షన్ లు
మూత్రనాళాలు ఇన్ఫెక్షన్ లకు గురవటం వలన కూడా మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడతాయి. ఈ రాళ్లు ఇన్ఫెక్షన్ వలన ఏర్పడటం వలన వీటిని స్ట్రూవైట్ లేదా ఇన్ఫెక్షన్ స్టోన్స్ అంటారు. ఈ రాళ్లు చాలా పెద్దవిగా ఏర్పడి కిడ్నీ, మూత్రనాళం లేదా పిత్తాశయాన్ని బ్లాక్ చేస్తాయి.
వైద్య పరిస్థితులు
కొన్ని రకాల వైద్యపరిస్థితులు నీరు, ఉప్పు మరియు మినరల్ లను అసమతుల్యతలను గురి చేసి ఇన్ఫెక్షన్ లను కలిగిస్తాయి. ఉదాహరణకు, కీళ్ళవాతం (గౌట్) లేదా కీమోథెరపీ చికిత్స చేపించుకున్న వారు యూరిక్ ఆసిడ్ సంబంధిత రాళ్లు కలిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. పేగు సంబంధిత సమస్యలు కలిగి ఉండే వారిలో అనగా ఇన్ఫ్లమేటరీ బోవేల్ డిసీస్, తీవ్రమైన విరేచనాలు మరియు పేగులలో శస్త్ర చికిత్స జరిగిన వారిలో మూత్ర పిండాలలో రాళ్లు ఏర్పడే అవకాశాలు అధికంగా ఉన్నాయి.
వంశపారంపర్యంగా సంక్రమణ
అవును వంశపారంపర్యంగా కూడా మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడటం సంక్రమించవచ్చు. మీ తల్లి దండ్రులలోఒకరికి లేదా ఇద్దరికీ మూత్రపిండాలలో రాళ్లు ఉంటే మీరు కూడా ఈ సమస్యకు గురయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కొన్ని కుటుంబాలలో రాళ్ల సంక్రమణ అనేక తరాల పాటూ కొనసాగుతూ వస్తుంది.
పారాథైరాయిడ్ రుగ్మతలు
అరుదుగా, పారాథైరాయిడ్ గ్రంధి నుండి అధికంగా హర్మోన్ ఉత్పత్తి చెందటం వలన కాల్షియం స్థాయిలు పెరిగి, మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడే అవకాశం రెట్టింపు అవవచ్చు.
Image source:Gettyimages.in
No comments:
Post a Comment